- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత కరెంట్.. అద్దెకుండే వారికి గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో:ఎన్నికల హామీల అమలులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఇప్పటికే ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు స్వీకరించిన ప్రభుత్వం వాటిని వడపోత పడుతోంది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కేవలం ఇంటి ఓనర్లకే వర్తిస్తుందని రెంట్ కు ఉన్న వారికి ఇది వర్తించదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై టీఎస్ ఎస్ పీడీసీఎల్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ప్రతిపాదిత గృహ జ్యోతి పథకం కింద అద్దెకుండే వారు కూడా అర్హులని పేర్కొంది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.
ఆధార్ తో సర్వీస్ నెంబర్ అనుసంధానం:
గృహ జ్యోతి పథకం అమలు కోసం క్షేత్ర స్థాయిలో విద్యుత్ మీటర్ కు ఆధార్, రేషన్ కార్డు నెంబర్లను అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గృహ జ్యోతి స్కీమ్ ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలంటే ఈ అనుసంధానం తప్పని సరి అని విద్యుత్ బిల్లు తీసే సమయంలో సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లను చూపి విద్యుత్ సర్వీస్ నెంబర్ కు లింక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ ఈ నెల రీడింగ్ ఇదివరకే తీసి ఉంటే సిబ్బంది మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.