Free Coaching: వైర్‌మాన్, సూపర్‌వైజర్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచిత శిక్షణ

by Shiva |
Free Coaching: వైర్‌మాన్, సూపర్‌వైజర్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచిత శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైర్‌మెన్, సూపర్‌వైజర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఈనెల 13 నుంచి 22 వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మింట్ కాంపౌండ్ ఆవరణంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు 7989349899, 9848258202 సంప్రదించాలని కోరారు. ప్రతి ఏటా రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్టార్‌లో పని చేస్తున్న ఎలక్ట్రిషన్ల కోసం వైర్‌మెన్, సూపర్వైజర్ల పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 15 ఏళ్ల నుంచి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed