- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వేలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
దిశ, నిజామాబాద్ క్రైం : రైల్వేలో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఓ నకిలీ రైల్వే ఉద్యోగి కుచ్చుటోపి పెట్టాడు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన నరేష్ అనే యువకుడు నగరంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులైన యువకులను మోసం చేశాడు.
ఒక్కొక్కరి నుంచి డబ్బులు దండుకున్న వ్యక్తి వారికి సౌత్ సెంట్రల్ రైల్వే పేరిట డూప్లికేట్ ఐడి కార్డులు ఇచ్చి, మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు నరేష్‌ను నిలదీయడంతో పరారీ ఆయ్యాడు. అయితే శుక్రవారం రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాధితులు నరేష్‌ను గుర్తించి పట్టుకొని నగరంలోని 1వ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అయితే ఇప్పటివరకు జిల్లాలో చాలా మంది అమాయక ప్రజలకు ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు బాధితులు వాపోయారు.
రూ.50 వేల నుంచి లక్ష వరకు తాము ఉద్యోగాలు వస్తాయని అప్పులు చేసి కట్టామని, తీరా చూస్తే మోసం చేశాడని తెలియడంతో మా డబ్బులు కావాలని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు. కొంతమందికి ఉద్యోగాల పేరుతో మూడు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేయించాడని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.