బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం

by Sathputhe Rajesh |
బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని సెంట్రల్​ జోన్​ టాస్క్​ఫోర్స్​పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రాధాకిషన్​రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ ​ప్రాంత నివాసి మీర్జా ఖాదర్​ బేగ్ అలియాస్ ​సమర్​(35) రియల్టర్. కాగా, తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో కొంతకాలంగా మోసాలకు తెర లేపాడు. ఈ క్రమంలో కాల్​సెంటర్​ను ప్రారంభించి లేడీ టెలీకాలర్స్​ను పెట్టుకుని ప్రధానంగా రియల్ ​ఎస్టేట్ ​వ్యాపారంలో ఉన్నవారికి ఫోన్లు చేయించేవాడు. కోటి నుంచి మొదలుకుని ఎంత మొత్తంలో అయినా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తామని చెప్పించేవాడు.

ఎవరైనా ఈ మాటలు నమ్మి సంప్రదిస్తే వారి నుంచి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్​ ఫీజు ​అంటూ లక్షల రూపాయలు వసూలు చేసుకునేవాడు. తొంభై నుంచి నూటా ఇరవై రోజుల లోపు రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఆ గడువు తీరగానే కాల్​సెంటర్​ను మూసేసి మరోచోట ప్రారంభించేవాడు. ఈ నేపథ్యంలో అతనిపై జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్​స్టేషన్లలో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు సీసీఎస్​లోని మహిళా పోలీస్​స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ స్టేషన్​లో వరకట్న వేధింపులు కూడా ఖాదర్​బేగ్ పై ఉన్నాయి. వేర్వేరు కేసులకు సంబంధించి ఖాదర్​బేగ్​పై పదకొండు నాన్​బెయిలబుల్ ​వారెంట్లు జారీ అయి ఉన్న నేపథ్యంలో సెంట్రల్​జోన్​ టాస్క్​ఫోర్స్ ​సీఐ రఘునాథ్​ ఎస్సై నవీన్​ కుమార్​తో పాటు సిబ్బందితో కలిసి అతన్ని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed