TS: బాధ్యతలు స్వీకరించిన నలుగురు ఎమ్మెల్సీలు

by GSrikanth |
TS: బాధ్యతలు స్వీకరించిన నలుగురు ఎమ్మెల్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాంబర్‌లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కూర్మయ్యగారి నవీన్ కుమార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాదరావు, విప్‌లు ఎం.ఎస్ ప్రభాకర్ రావు, శంభీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, శేరి శుభాష్ రెడ్డి, ఎల్.రమణ, ఎగ్గే మల్లేశం, దండే విఠల్, రఘోతంరెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, అబ్రహం, మెతుకు ఆనంద్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story