- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కలు విశ్వాసానికి ప్రతీక.. వాటిని శత్రువులుగా చూడొద్దు: అక్కినేని అమల
దిశ, డైనమిక్ బ్యూరో: ఒకటి, రెండు దురదృష్టకర ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలను శత్రువులుగా చూడొద్దని ప్రముఖ నటి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్ సంక్షేమ సంఘంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అక్కినేని అమల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమల మాట్లాడుతూ.. కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయన్నారు. ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలు జనంలో కోపాన్ని, ఆవేశాన్ని కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, వాటిని కొట్టటం లేదా చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కుక్కలను ఓపికగా ప్రేమగా చూస్తే అవి పదింతలు మనల్ని ప్రేమిస్తాయన్నారు. వాటి ప్రాణాల్ని సైతం ఇచ్చి ఇతరులను కాపాడిన ఉదంతాలు కూడా ఉన్నాయని అమల వ్యాఖ్యానించారు. ఓ వైపు మన రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు కుక్కలకు రేబిస్, కు.ని. ఆపరేషన్లు చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. శాంతినగర్ సంక్షేమ సంఘం కార్యదర్శి పి.అశ్విన్‌కుమార్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ వివేకానంద, వివిధ కాలనీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.