మణిపూర్లో మారణహోమం జరుగుతోంది.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి

by Javid Pasha |
మణిపూర్లో మారణహోమం జరుగుతోంది..  కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో మారణ హోమం జరుగుతోందని ఆరోపించారు. దేశంలోని ఓ భాగం కాలిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో అంత హింస జరుగుతోన్న ప్రధాని మోడీ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీ మణిపూర్ పై మౌనం వీడాలని అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న హింసను అరికట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story