- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నాలుక చీరేస్తాం’.. బాల్క సుమన్‌కు మాజీ MP సిరిసిల్ల రాజయ్య వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల బీఆర్ఎస్ ప్రెసిడెంట్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగితే నాలుక చీరేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ అహంకారం మదంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలే బాల్క సుమన్ తరిమికొడతారని హెచ్చరించారు.
కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఒక రండ అంటూ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బాల్క సుమన్ సైతం అదే రీతిలో అసభ్య పదజాలంతో సీఎంను దూషించాడు. సోమవారం మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిట్టిన రేవంత్ రెడ్డినే ఒక రండ, లంగా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సీఎంను దూషించాడంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది.