బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ

by Disha Web Desk 12 |
బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు బలం తగ్గుతుంది. ఓటమి కారణంగా కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టికి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపినట్లు తెలిపారు. అలాగే మాజీ ఎంపీ తో పాటు.. మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలుస్తుంది. మరి వీరు ఏ పార్టీలో చేరతారనే సమాచారం తెలియరాలేదు.

Next Story

Most Viewed