మండపంలో నా వాడు అంటే నా వాడు అని వరుడి కోసం కొట్టుకున్న వధువు, ప్రియురాలు!

by Kavitha |   ( Updated:2024-05-18 08:04:00.0  )
మండపంలో నా వాడు అంటే నా వాడు అని వరుడి కోసం కొట్టుకున్న వధువు, ప్రియురాలు!
X

దిశ,ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పందిరి లో ఏ చిన్న ఈవెంట్ జరిగిన అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటోంది. అయితే.. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే. కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే ఒక యువతితో రాసలీలలు నడిపి, కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ దగుర్భాజికి గట్టి షాకే తగిలింది.

తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన ఆ యువతి ఏకంగా పెళ్లి మండపానికి వెళ్లి మరీ గొడవ చేసింది. వరుడితో పాటు అక్కడున్న అతిథులు చూస్తుండగానే.. వాడు నా వాడు అంటే నా వాడు అంటూ వధువు, ఆ యువతి కొట్టుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీలేదు కానీ ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ వారిద్దరిలో ఆ వరుడు ఎవరికి దక్కాడో మాత్రం తెలియలేదు.

Advertisement

Next Story