ప్రతిరోజూ గుండెల్లో మంట దేనికి సంకేతం?.. ఎలా తగ్గించుకోవాలి?

by Javid Pasha |
ప్రతిరోజూ గుండెల్లో మంట దేనికి సంకేతం?.. ఎలా తగ్గించుకోవాలి?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని ఆరోగ్య సమస్యలు పెద్ద హానికరమైనవి కాకపోవచ్చు. కానీ వాటి లక్షణాలు మాత్రం ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తాయి. ప్రాణహాని సంభవిస్తుందేమోననే భయాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో గుండెలో లేదా ఛాతీలో మంట ఒకటి. కానీ ఇది ఎసిడిటీవల్ల వచ్చే సాధారణ సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.

రాత్రిపూట పడుకున్నప్పుడు లేదా పొద్దున్న లేవగానే గుండెల్లో మంటగా అనిపించడం గుండె జబ్బు లక్షణం ఏమాత్రం కాదు. ఇది శరీరంలోని యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల తలెత్తే సాధారణ సమస్య. జంక్ అండ్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆహారం పరిమితికి మించి తినడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, ఉదయం లేట్‌గా నిద్రలేవడం వంటి అలవాట్లతో ఈ సమస్య వస్తుంది. కాబట్టి జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో సరైన మార్పులు చేసుకోవడమే దీనికి చక్కటి పరిష్కారంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే సమస్య తలెత్తినప్పుడు ఇంటిలో పాటించగలిగే కొన్ని రెమెడీస్ కూడా గుండెల్లో మంటను, ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి.

పరిగడుపున ఇలా చేయండి

ఎసిడిటీవల్ల వచ్చే గుండెల్లో మంటను తగ్గించడంలో సోంపు వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో ఉబ్బరాన్ని, ఇబ్బందిని తొలగిస్తుంది. ఒక టీస్పూన్ సోంపును తీసుకొని ఒక గ్లాసు నీళ్లల్లో రాత్రిపూట నానబెట్టి పొద్దున్న పరిగడుపు తాగుతూ ఉంటే లివర్‌లో పేరుకుపోయే పైత్య రసాలు తొలగిపోతాయి. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్షన్స్ తగ్గి గుండెల్లో, ఛాతీలో మంట వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువు సమస్య కూడా దూరం అవుతుంది.

లెమన్ అండ్ జింజర్ వాటర్

పైత్య రసాలవల్ల తలెత్తే గుండె మంటలను తగ్గించడంలో అల్లం నీరు, నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలను నివారిస్తాయి. ఎందుకంటే వీటిలో జింజెరోల్ ఎంజైమ్ ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్‌ను నివారించి, జీర్ణరసాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అందుకే అల్లం, నిమ్మకాయ రసాన్ని నీటిలో కలిపి ఉదయంపూట తాగితే రెండు మూడు రోజుల్లో గుండెల్లో మంట తగ్గిపోతుంది.

తిన్న వెంటనే ఈ పనిచేయకండి

నిజానికి యాసిడ్ రిఫ్లెక్స్‌కు కారణం అయ్యే ఆమ్లం వంటి స్రావం పరిమితికి మించి తినడం, సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తిన్నవెంటనే పడుకోవడంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే ఇలా చేయడంవల్ల తిన్న ఆహారం సరిగ్గా డైజేషన్ కాదు. ఇది యాసి రిఫ్లెక్షన్‌కు కారణం అవుతుంది. పైగా తిన్నవెంటనే పడుకునే అలవాటు ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి గుండెల్లో మంటకు కారణం అయ్యే ఇటువంటి అలవాట్లను మార్చుకోవడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed