- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rajaiah: రేవంత్ రెడ్డి ఆ సామాజికవర్గానికి కొమ్ము కాస్తున్నారు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని.. దేని ప్రకారం వర్గీకరణ చేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఏ,బీ,సీ రిజర్వేషన్లు పెట్టారని.. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారని తెలిపారు. షమీమ్ అక్తర్ కమిటీ కూడా మాదిగలకు అన్యాయం జరిగినట్లు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. జనాభా ప్రకారం అయితే మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరీల్లో వివేక్ వెంకటస్వామి హస్తం ఉందని.. ఖర్గే, కొప్పుల రాజు, భట్టి, వివేక్ వెంకటస్వామి లాబీయింగ్‌కు రేవంత్ రెడ్డి లొంగారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.