- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ టెట్ -2024 పరీక్ష దరఖాస్తుల ఫీజు తగ్గించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ 2024 ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు మాత్రమే తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు 2000 రూపాయాలకు పెంచడం సరికాదన్నారు.
పెంచిన ఫీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి అభ్యర్థులపై చాలా భారం పడుతుందన్నారు. అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారని, దీని వల్ల కూడా మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారని తెలిపారు. దూరం భారంతో పాటు ఆర్థికంగానూ భారం పడుతుందన్నారు. కావున మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకుని పెంచిన ఫీజులు తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు.