KCR : కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. అందుకేనా?

by Ramesh N |   ( Updated:2024-08-04 13:32:28.0  )
KCR : కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. అందుకేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌‌తో తాజాగా భేటి అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ మహిళా నేతలను సీఎం రేవంత్‌రెడ్డి అవమానించారని, అందుకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ అట్టుడికిపోయింది.

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎంతో సహా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారంపై కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డితో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై గులాబీ బాస్ మాట్లాడినట్లు సమాచారం.

Advertisement

Next Story