KCR పేరు ఉంటే తప్పేంటి..? కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి సబితా ఫైర్

by Satheesh |   ( Updated:2024-06-14 07:41:22.0  )
KCR పేరు ఉంటే తప్పేంటి..? కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి సబితా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న పుస్తకాల్లోని ముందుమాట పేజీలో మాజీ సీఎం కేసీఆర్ పేరు ఉండటంతో ప్రభుత్వం బుక్స్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో అధికారులు ముందు మాట పేజీని చించివేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కేసీఆర్ పేరు ఉందని పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా వెనక్కి తీసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పేరు ఉందని బుక్స్ పంపిణీ చేయకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యక్తిగత కక్షలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed