- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదిగల కోసం ప్రాణమైనా ఇస్తా.. మాజీ మంత్రి మోత్కుపల్లి ప్రకటన
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మాదిగల కోసం తన ప్రాణమైనా ఇస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. తనకు మొదటి ప్రాధాన్యత మాదిగ సామాజిక వర్గమేనని, ఆ తర్వాతే పార్టీ, పాలిటిక్స్ అని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని వెల్ నెస్ హాస్పిటల్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ టిక్కెట్ల విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైకమాండ్‌కూ లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది మాదిగలు ఉన్నారని, పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మాదిగలు అసహనానికి గురైతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
Advertisement
Next Story