రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి

by GSrikanth |   ( Updated:2024-02-09 14:46:27.0  )
రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకున్న వెంటనే అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మాదిరి మా ఇంట్లోనూ ముగ్గురికి పదవులు ఉండాలని కోరుకుంటున్నా.. అందులో భాగంగానే నా కుమారుడు భద్రారెడ్డిని ఈ సారి ఎన్నికల బరిలో నిలుపుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి నా కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని మల్లారెడ్డి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపణలపైనా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రెస్‌మీట్‌లో నా పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు అని సెటైర్ వేశారు. గతంలో రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి తిట్టిన తీరు అందరికీ గుర్తుంది అని తెలిపారు. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కర్చీఫ్ వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ప్రయత్నాలు తెలిసి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కేవలం చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పారు.

Advertisement

Next Story