- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్ వాళ్లకు మేడిగడ్డ తప్ప.. వేరే గడ్డే దొరకట్లే: మల్లారెడ్డి సెటైర్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శాసన సభను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు మేడిగడ్డ తప్ప వేరే గడ్డనే దొరకడం లేదని తనదైన శైలీలో మల్లారెడ్డి సెటైర్ వేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గరి నుండి రోజూ మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎక్కడో చిన్న లీకేజీ అయ్యిందని.. దానిని ప్రభుత్వం భూతద్దంలో చూపిస్తుందని మండిపడ్డారు.
Next Story