- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారం వాళ్ల చేతుల్లో ఉంది.. ఏమైనా చేస్తారు: మల్లారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి హెచ్‌ఎండీఏ అధికారులు షాకిచ్చారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఆయన వేసుకున్న రోడ్డును శనివారం అధికారులు తొలగించారు. వివరాల్లోకి వెళితే.. గతంలో పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2,500 గజాల్లో కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేశారు. హెచ్‌ఎమ్‌డీఏ స్థలం ఆక్రమించి రోడ్డు వేశారని రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు. తాజాగా.. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు.
ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తోందన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామన్నారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య, విద్యార్థుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.