- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి వెళ్తాడని ప్రచారం.. మల్లారెడ్డితో కేటీఆర్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుమారుడు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోను అని చెప్పడంతో పాటు ఇటీవల ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడంపైనా కేటీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవానాల కూల్చివేతలపైనా మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నాడని వస్తున్న వార్తలపైనా స్పందించారు. తనకు పార్టీలు మారే అవసరం లేదని.. మారబోను అని కేటీఆర్‌కు క్లియర్‌గా చెప్పినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా, ఇటీవల మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని చిన్న దామెరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎమ్ఎల్ఆర్ఐటీ కళాశాలకు చెందిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లు కూల్చేశారు.