Malla Reddy: మళ్ళీ పాలు అమ్మిన మల్లారెడ్డి! పాల డబ్బాల స్కూటర్‌పై మాజీ మంత్రి సందడి

by Ramesh N |   ( Updated:2025-02-16 11:00:39.0  )
Malla Reddy: మళ్ళీ పాలు అమ్మిన మల్లారెడ్డి! పాల డబ్బాల స్కూటర్‌పై మాజీ మంత్రి సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) చెప్పిన డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా మళ్ళీ ఆయన పాల బండిపై కనిపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి.. అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్‌పై ఎక్కి కూర్చున్నారు. పాల బండిని చూడగానే పాలు అమ్మిన రోజులను గుర్తుకు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పాల బండిపై ఎక్కి చక చక ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మళ్ళీ పాలు అమ్ముతున్నారా? మల్లారెడ్డి అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, మల్లారెడ్డి పాలు అమ్మిన డైలాగ్ అందరికీ సుపరిచితమే. స్కూటర్‌పై పాలమ్మే స్థాయి నుంచి ఎన్నో విద్యా సంస్థలు, వ్యాపారాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గతంలో తెలంగాణ మంత్రిగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

Next Story

Most Viewed