- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR: ప్రజల్లోకి గులాబీ బాస్ కేసీఆర్! క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కేటీఆర్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల్లోకి గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎప్పుడు వస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ ఏడాది పాలనపై ఏ విధంగా స్పందిస్తారోనని నేతలు, ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) క్లారిటీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. 24 ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు.. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా 2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, 2025 సంవత్సరంలో (BRS) బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతామని వెల్లడించారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందన్నారు. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.