- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం: మాజీ మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్పుపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నానని చెప్పారు. మంగళవారం ‘‘దిశ’’ టీవీతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాకు బీఆర్ఎస్‌లో మెంబర్ షిపే ఇవ్వలేదని.. అలాంటప్పుడు తమను బీఆర్ఎస్ నుండి కేసీఆర్ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఈటలతో చర్చలు జరిపిన మాట వాస్తవం అన్నారు. పొంగులేటి, జూపల్లి నాకే కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జూపల్లి.. ఈటల తమను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని కానీ వారినే మాతో రావాలని మేము పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
అందరం కలిసి ఒకే వైపు ఉండి ఒకే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యం అని.. దానికి కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను అన్వేషిస్తామని అన్నారు. కేసీఆర్‌ను ఎలా ఢీకొట్టాలనే విషయంలో మా ప్రణాళికలు మాకు ఉన్నాయని చెప్పిన జూపల్లి.. వచ్చే నెలలో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో క్లారిటీ ఇస్తామని చెప్పారు.
Also Read..
సీఎం కేసీఆర్ కు బంగారు తెలంగాణ సాధనే ఎజెండా : హోం మంత్రి మహమూద్ అలీ