- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి స్థూపం తాకే హక్కు లేదు.. జోగు రామన్న ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇంద్రవెల్లిలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను కాంగ్రెస్ పొట్టన బెట్టుకుందన్నారు. సీఎం క్షమాపణ చెబితే సరిపోతుందా? అని మండిపడ్డారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి స్థూపం తాకే హక్కే లేదని అన్నారు. స్థూపం కట్టిన తర్వాత కూల్చింది కాంగ్రెస్ వాళ్ళే అని గుర్తుచేశారు. ప్రజా సంఘాల ఒత్తిడితో ఆ స్థూపం మళ్లీ నిర్మాణమైందని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే స్థూపం దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ దొరికిందని అన్నారు. నిన్న కూడా ఐదు జిల్లాల పోలీసుల పహారాలో ప్రోగ్రాం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో నిన్న కూడా రేవంత్ రెడ్డి అదే మాట్లాడారని ఎద్దేవా చేశారు.
నాగోబా దేవాలయానికి కేసీఆర్ నిధులు ఇస్తే రేవంత్ ప్రారంభోత్సవాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి అవమాన పరిచారని సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్‌కు కేసీఆర్ హయాంలోనే నిధులొచ్చాయని గుర్తుచేశారు. 220కి పైగా తండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు అయ్యాయని తెలిపారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏనాడు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు.. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆవేదన చెందారు. వివరాలు తెప్పించుకుని రేవంత్ వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. పార్టీ నాయకుడిగా మాట్లాడొద్దు.. ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ప్రవర్తించాలని సూచించారు. బ్రోకర్ దందాలు చేసి రేవంత్ సీఎం కావడం ప్రజలు దురదృష్టం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి కేసీఆర్ కుటుంబంపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.