- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Jagadish Reddy: మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ కమిషన్(Power Commission) చైర్మన్‌గా మదన్ బీ లోకూర్(Madan Lokur) ఎప్పుడు పని చేశారో మాకు తెలియదు. విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. మా వివరణను చైర్మన్ తీసుకోలేదని అన్నారు. కావాలనే కుట్ర పూరితంగా కొన్ని మీడియా సంస్థలు మాపైన విషం కక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆరోపణలను మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కమిషన్ వేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి. కేసీఆర్(KCR) ముందు చిల్లర వేషాలు వేయలేరు.
దొంగతనంగా ఎందుకు లీకులు ఇస్తున్నారు. మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు. మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్యుత్ కమిషన్(Power Commission) రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు తామేం తప్పు చేశామని జైల్లో పెడతారు? కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? అని అడిగారు. రాష్ట్రంలో ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు.