MP ఎన్నికల్లో BRS ఘోర ఓటమి.. మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ ఇదే

by Satheesh |
MP ఎన్నికల్లో BRS ఘోర ఓటమి.. మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగిన బీఆర్ఎస్.. కనీసం ఒక్క చోటు గెలవకుండా ఎన్నికల పోరులో పూర్తిగా చేతులేత్తిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా 38 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కస్థానంలో కూడా ఖాతా తెరవకుండా థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే పోటీ చేసిన 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీని ఢీకొట్టలేక ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటమిపై మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 24ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదు. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తాం. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తాం. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతాం.. జై తెలంగాణ’’ అంటూ ఎన్నికల ఫలితాలపై హరీష్ రావు స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed