కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష: హరీష్ రావు

by GSrikanth |
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మభ్య పెట్టిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్‌కు స్పీడ్ బ్రేకర్ లాంటిదే అని చెప్పారు. .

వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో మళ్లీ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని.. అనవసరంగా కేసీఆర్‌ను ఓడించామని బాధపడతారని జోస్యం చెప్పారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం అన్నారు. తాను జిల్లాలో తిరుగుతుంటే కొంత మంది రైతు బంధు అని అడుగుతున్నట్లు వెల్లడించారు. పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయన్నారు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed