నేరగాళ్లకు స్వయంగా బ్యాంక్ ఖాతాలు తెరిచిన మాజీ మేనేజర్ అరెస్ట్

by M.Rajitha |
నేరగాళ్లకు స్వయంగా బ్యాంక్ ఖాతాలు తెరిచిన మాజీ మేనేజర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల హైదరాబాద్ లో వెలుగు చూసిన రూ.175 కోట్ల సైబర్ క్రైంలో ఓ బ్యాంక్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. నగరంలోని షంషేర్ గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ మాజీ మేనేజర్ మధుబాబు సైబర్ నేరగాళ్లకు స్వయంగా బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఇచ్చినట్టు విచారణలో తేలింది. కాగా మధుబాబుతో పాటు సందీప్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇరువురు కలిసి ఆరుగురు క్యాబ్, ఆటో డ్రైవర్లకు కరెంట్ అకౌంట్లు తెరిచారు. పేదల తరపున కరెంట్ బ్యాంక్ ఖాతాలు తెరచి, వాటి ద్వారా రూ.175 కోట్ల సొమ్మును నిందితులు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. కాగా ఇదే కేసులో రెండు రోజుల కింద మరో ఇద్దరిని కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేయగా, నేడు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story

Most Viewed