తొలిసారి MLC జీవన్ రెడ్డి అంశంపై స్పందించిన CM రేవంత్ రెడ్డి

by Rajesh |   ( Updated:2024-06-27 07:07:55.0  )
తొలిసారి MLC జీవన్ రెడ్డి అంశంపై స్పందించిన CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జీవన్ రెడ్డి అంశంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని హై కమాండ్‌కు చెప్పినట్లు స్పష్టం చేశారు. మూడేళ్ల తన పదవి కాలం ముగిసిందన్నారు. సమర్థవంతమైన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగాలని చూశారన్నారు.

కాంగ్రెస్ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత వారికి అర్థం కాదని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారని.. రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని స్పష్టం చేశారు. విద్యాశాఖ తన వద్దే ఉందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేదో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించామని.. ఏపీలో 40-50 మంది అధికారులను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల నిర్వహణపై కేంద్రం కూడా ఆరోపణలు చేయలేదన్నారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసు ఒక్కటీ పెట్టేలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్రం అని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారని గుర్తు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు.

విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాదించలేదన్నారు. మంత్రి వర్గంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారన్నారు. తెలంగాణలో ఏ శాఖలు ఖాళీగా లేవన్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు. ఏపీ, తెలంగాణ వివాదాల గురించి స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed