Electric Shock : వాకిలి ఊడుస్తూ మహిళ మృతి.. విద్యుత్ శాఖ అధికారులే కారణమా..

by Sumithra |
Electric Shock : వాకిలి ఊడుస్తూ మహిళ మృతి.. విద్యుత్ శాఖ అధికారులే కారణమా..
X

దిశ, నాగర్ కర్నూల్ : ఉదయాన్నే వాకిలి ఊడుస్తున్న ఓ మహిళకు కరెంటు వైర్ తగిలి ( electric shock ) మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని దేశీ ఇటిక్యాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కూర స్వామి అతని భార్య భాగ్యమ్మ (35) ఉదయం ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా కరెంటు వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెంది . కొన్ని రోజులుగా కరెంటు వైర్ తెగి కింద పడిపోయిందని విద్యుత్ శాఖ అధికారులకు (Electricity Department) చెప్పినా నిర్లక్ష్యం చేయడం వల్లనే భాగ్యమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చేవరకు మృతదేహాన్ని కదిలించమని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story