Union Minister: తెలంగాణకు కేవలం రైల్వేలకే రూ. 5,336 కోట్ల నిధులు కేటాయింపు: కేంద్రమంత్రి

by Mahesh |
Union Minister: తెలంగాణకు కేవలం రైల్వేలకే రూ. 5,336 కోట్ల నిధులు కేటాయింపు: కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధుల కేటాయింపు లేదని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టి చర్చించింది. ఇదిలా ఉంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రం తెలంగాణకు కేంద్ర పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో కేవలం రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 5336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరగుతున్నాయని గుర్తు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ కింది 40 రైల్వే ష్టేషన్లను ఎంపిక చేశామని.. 437 అండర్ పాస్ ప్రాజెక్టులు పూర్తి చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు.



Next Story