కరాచీ బేకరీలో తనిఖీలు.. ఎక్స్‌పైరీ బిస్కెట్లు, చాక్లెట్ కేకులు గుర్తింపు

by Ramesh N |
కరాచీ బేకరీలో తనిఖీలు.. ఎక్స్‌పైరీ బిస్కెట్లు, చాక్లెట్ కేకులు గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రసిద్ది చెందిన కరాచీ బేకరీలో అధికారులు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను అధికారులు గుర్తించారు. రూ.5,200 విలువైన రస్క్‌లు, బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, టోస్ట్‌లు, బన్స్‌ల గడువు ముగిసినట్లు అధికారులు గర్తించారు. మరోవైపు అనేక లేబుల్ లేని ఉత్పత్తులను కనుగొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇటీవల హిమాయత్‌నగర్‌లోని క్లోవ్‌ వెజిటేరియన్‌ ఫైన్‌ డైన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఐస్‌క్రీమ్‌ స్టోరేజీ యూనిట్‌లో సజీవ బొద్దింకలను గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు వారు చీజ్, సిరప్, మసాలాలు, శాండ్‌విచ్ బ్రెడ్, బ్రౌన్ షుగర్ వంటి గడువు ముగిసిన ఉత్పత్తులను కనుగొన్నారు. ఫంగల్ సోకిన క్యారెట్లు, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన వెజిటబుల్ బిర్యానీ, అపరిశుభ్రమైన పరిస్థితులను కూడా అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed