BRS VS Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల గొడవ! టార్గెట్ చేశారని ఆరోపణలు

by Ramesh N |
BRS VS Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల గొడవ! టార్గెట్ చేశారని ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సర్కిల్ల వద్ద ఏర్పాటు చేసిన పార్టీల ఫ్లెక్సీలు(Flexi), బ్యానర్లను హైడ్రా, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినం కావడంతో ఏర్పాటు చేసిన బ్యానర్లను కూడా అధికారులు తొలగించారు. దీంతో (BRS) బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. (Congress) కాంగ్రెస్ నేతలవి కాకుండా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ కేవలం కేసీఆర్ ఫ్లెక్సీలనే అధికారులు తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుకట్‌పల్లిలో తాజాగా కేసీఆర్, ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారు..? కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం? బీఆర్ఎస్ పార్టీకి మరొక న్యాయమా? అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని, రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు రోడ్లపై తీయకపోతే అధికారులకు బుద్దిచెపుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. అదేవిధంగా కల్వకుర్తిలో నేడు జరగనున్న బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు చింపేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Next Story

Most Viewed