ఫస్ట్ ఫేజ్ ఫిల్టర్ కంప్లీట్.. సీల్డ్ కవర్‌లో కాంగ్రెస్ MP అభ్యర్థుల లిస్టు..!

by Satheesh |   ( Updated:2024-02-07 17:04:20.0  )
ఫస్ట్ ఫేజ్ ఫిల్టర్ కంప్లీట్.. సీల్డ్ కవర్‌లో కాంగ్రెస్ MP అభ్యర్థుల లిస్టు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధుల ఫస్ట్ ఫేజ్ వడపోత కంప్లీట్ అయింది. పీఈసీ వచ్చిన అప్లికేషన్ల నుంచి ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌కు ముగ్గురు చొప్పున సెలక్ట్ చేసి ఆ జాబితాను సీల్డ్ కవర్‌లో స్క్రీనింగ్ కమిటీకి అందజేశారు. ఈ కమిటీ మరోసారి ఈ నెల 19న ప్రదేశ్ ఎన్నికల కమిటి మీటింగ్‌ను నిర్వహించే ఛాన్స్ ఉన్నది. ఆ తర్వాత కొన్ని పేర్లను ఫైనల్ చేసి, ఆ జాబితాను సీల్డ్ కవర్‌లో ఢిల్లీకీ పంపించనున్నారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఒక్కో పేరును పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తామని స్క్రీనింగ్ కమిటీ మెంబరు ఒకరు తెలిపారు. ఇక బుధవారం మార్కింగ్ ప్రాసెస్ ఉన్నదని తెలుసుకున్న ఆశావహులు గాంధీభవన్‌లో హాడావిడి చేశారు. తమకు మద్దతు తెలపాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) లోని పలువురి మెంబర్లను రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లలోని 309 పేర్లను ఫిల్టర్ చేసిన పీఈసీ, సగం పేర్లను తొలగించినట్లు సమాచారం. మరో మీటింగ్‌లో మరిన్ని పేర్లు ఫిల్టర్ కానున్నాయని పార్టీకి చెందిన ఒకరు తెలిపారు.

Advertisement

Next Story