- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ములుగులో ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు.. రాహుల్ పర్యటన వేళ హై అలర్ట్!
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులంతా ములుగుకు చేరుకున్నారు. ఇవాళ ఏఐసీసీ ప్రకటించిన 55 మంది అభ్యర్థులు ఈరోజు రామప్ప దేవాలయం ముందు ఏఐసీసీ అగ్రనేత లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీర్వాదం తీసుకోనున్నారు. శివుడి ముందు సిక్స్ గ్యారంటీల కార్డును పెట్టి అభ్యర్థుల సమక్షంలోనే ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో మొదటి జాబితాలోని 55 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు పాల్గొననున్నారు.
ములుగు భూపాలపల్లి జిల్లాల్లో యాత్ర జరుగుతుంది. మూడు ప్రాంతాలలో మహిళలు రైతులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇంట్రాక్ట్ కానున్నారు. ఇక మొదటి రోజు పాదయాత్ర పూర్తి కాగానే ప్రియాంక గాంధీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు. రాహుల్ గాంధీ మాత్రం భూపాల పల్లిలో బస చేయనున్నారు. ఇప్పటికే రామప్ప దేవాలయం, రాహుల్, ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్న ప్రాంతాలన్నీ సెంటర్ సెక్యూరిటీ ఏజెన్సీలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో పాటు రాహుల్ గాంధీ బస చేయనున్న ప్రాంతాన్ని సెంటర్ సెక్యూరిటీతో పాటు స్టేట్ ప్రోటోకాల్ సంస్థలు పరిశీలించాయి. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో రామప్ప దేవాలయం పూజా కార్యక్రమాలు, బస్సు యాత్రకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.