యాదాద్రిలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

by Gantepaka Srikanth |
యాదాద్రిలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Dist)లో తొలి బర్డ్ ఫ్లూ కేసు(Bird Flu Case) నమోదైంది. వారం రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో వెయ్యి కోళ్లు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు శాంపిల్స్‌ను టెస్ట్‌లకు పంపించగా.. ఇవాళ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్(Bird flu positive) నిర్ధారణ అయ్యింది. దీంతో శనివారం నేలపట్ల గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో పటిష్ట నిఘా పెట్టారు.

మరోవైపు ఇటీవలే.. నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలోని పలు కోళ్ల ఫారమ్‌లలో బర్డ్ ఫ్లూ కారణంగా 7000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. హైదరాబాద్ నుండి వచ్చిన జోనల్ డాక్టర్లు పలుమార్లు వైద్యం అందించినా ఫలితం లేకపోయిందని పౌల్ట్రీ రైతు అన్నారు. 7000 కోళ్ల మరణంతో రైతు దాదాపు 3 లక్షల నష్టం చవిచూసినట్లు తెలిపారు. జేసీబీ సహాయంతో పూడిక తీసి కోళ్లను పాతిపెట్టారు.

Next Story