సర్కారు నిర్లక్ష్యం వల్లే ఫైర్ యాక్సిడెంట్స్.. : తమ్మినేని వీరభద్రం

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-13 09:44:30.0  )
సర్కారు నిర్లక్ష్యం వల్లే ఫైర్ యాక్సిడెంట్స్.. : తమ్మినేని వీరభద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నాంపల్లి కెమికల్‌ గోడౌన్‌ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికుల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని మృతి చెందిన వారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షలు అందించాలని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కెమికల్‌ గోడౌన్లను ఉంచకుండా శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story