వచ్చే 5 ఏళ్లలో భారత్ టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోబోతోంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

by karthikeya |   ( Updated:2024-10-04 16:08:00.0  )
వచ్చే 5 ఏళ్లలో భారత్ టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోబోతోంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఐదేళ్లలో దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రెట్టింపు కాబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు (శుక్రవారం) నుంచి 3 రోజుల పాటు జరుగనున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 2024 లో సదస్సులో నేడు కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశంలో అసమానతలు తగ్గుతాయని, పట్టణాలతో పాటు గ్రామాలూ అభివృద్ధి బాటలో దూసుకెళతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘భారతదేశ తలసరి ఆదాయం 2,730 డాలర్లకు చేరేందుకు మనకు 75 సంవత్సరాలు పట్టింది. కానీ వచ్చే ఐదేళ్లలో మరో 2,000 డాలర్లును కచ్చితంగా చేరుకుంటాం. వచ్చే పదేళ్లలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి అనూహ్యంగా పెరుగుతుంది. గత పదేళ్లలో మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యం కాబోతోంది. ఇక బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ కొన్నేళ్ల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం బ్యాంకుల దగ్గర సమర్థవంతమైన రుణ రికవరీ విధానాలు ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా 2047 నాటికి భారత్‌ కచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవబోతోంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed