‘ఫిఫ్త్ హాటేస్ట్ మంథ్’గా ఫిబ్రవరి - 2023.. 122 సంవత్సరాలలో..

by Sathputhe Rajesh |
‘ఫిఫ్త్ హాటేస్ట్ మంథ్’గా ఫిబ్రవరి - 2023.. 122 సంవత్సరాలలో..
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారతదేశంలో ఫిబ్రవరి-2023 అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించింది. ఈ ఫిబ్రవరి నెలలో అత్యధిక ఎండలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 1901 తర్వాత అంటే దాదాపు 122 సంవత్సరాల తర్వాత ఈ ఏడాదే అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ఫిబ్రవరి నెలలో వాయువ్య భారతదేశం( నార్త్ ఇండియా)లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలు నమోదైందని వెల్లడించింది.

ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీలు ఎక్కువ. మార్చిలో వడగాడ్పుల ప్రభావం కొంత వరకు ఉండొచ్చని, ఏప్రిల్‌, మేలో మాత్రం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నది. కాగా, గత 14 సంవత్సరాలతో గరిష్ఠంగా 5 అతి వేడి ఫిబ్రవరి నెలలు నమోదయ్యాయని, అందులో ఇది ఫిఫ్త్ హాటెస్ట్ ఫిబ్రవరి అని పేర్కొంది. ఇవి వాతావరణాన్ని సంక్షోభానికి గురిచేసే అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని ఐఎండీ పేర్కొంది. రానున్న సంవత్సరాలలో క్రమక్రమంగా చలి తీవ్రత తగ్గిపోయి భీకరమైన ఎండలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దీనికి స్థానికంగా, వాతావరణ మార్పులే కారణమని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed