- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Deportation : డిపోర్టేషన్ భయం... తెలుగు విద్యార్థి సూసైడ్

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో ఉన్న తెలుగు వారిని డిపోర్టేషన్(Deportation) భయం వెంటాడుతోంది. తనను బలవంతంగా డిపోర్ట్ చేస్తారేమో అనే భయంతో ఓ విద్యార్థి సూసైడ్(Student Suicide) చేసుకోవడం కలకలం రేపింది. ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళిన సాయికుమార్ రెడ్డి(SaiKumar Reddy) అనే విద్యార్థి.. చదువు పూర్తి అయ్యాక.. ఉద్యోగం కోసం వెతుకుతూ.. ఓ పార్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(USA President Donald Trump) అధికారంలోకి వచ్చాక.. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను వారి వారి దేశాలకు డిపోర్టేషన్ పేరుతో వెనక్కి పంపిస్తున్నారు. ఈ క్రమంలో సాయికుమార్ పనిచేసే చోట తనిఖీలు నిర్వహించిన అధికారులు.. విద్యార్థిగా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే నివాసం ఉంటున్నట్టు గుర్తించి, అతని పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. తనను ఇండియాకు తిరిగి పంపిస్తారనే భయంతో పనిచేసే చోటనే ఆత్మహత్య చేసుకొని మరణించాడు.
కాగా సాయికుమార్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతని స్నేహితులు కుటుంబ సభ్యులను సప్రదించే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల వందలాది మంది భారతీయులను అక్రమ వలసదారుల పేరిట అమెరికా వెనక్కి పంపించింది. అయితే వివిధ దేశాల నేతలు డిపోర్టేషన్ పేరుతో వెనక్కి పంపడాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపడం వరకు ఒకే గాని, నేరస్తుల లాగ కాళ్ళు చేతులకు గొలుసులు వేసి పంపడం ఏమిటని మండిపడుతున్నారు. కనీస మానవత్వం లేకపోతే ఎలా అంటూ ట్రంప్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.