- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandla Ganesh: వాలెంటైన్స్ డే రోజున.. కేసీఆర్‌కు 'లవ్ యూ' అని చెప్పిన బండ్ల గణేష్
దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. 'తెలంగాణ అద్భుతమైన ప్రగతి పదం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం. కేసీఆర్ ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతం.
కేసీఆర్ ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పదం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నా. చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను. లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్' అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.