కంటతడి పెట్టిన RS ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ (వీడియో)

by GSrikanth |
కంటతడి పెట్టిన RS ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ (వీడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​'బహుజన రాజ్యాధికార యాత్ర'ను ప్రారంభించారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా 300 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. అయితే ఈ 300 రోజుల పాటు ఆయన కుటుంబానికి దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ఆర్ఎస్పీ కూతురు, కుమారుడు, సతీమణి కంటతడి పెట్టుకున్నారు. కాగా దీనిపై మాజీ ఐపీఎస్​ప్రవీణ్​కుమార్​ఎమోషనల్​ట్వీట్​చేశారు. బహుజన యాత్రలో భాగంగా తాను 300 రోజులు కుటుంబంతో తానుండే అవకాశం లేదన్న విషయం కొంత ఉద్విగ్నానికి గురి చేసినా, బహుజన రాజ్యస్థాపన ద్వారా కొన్ని తరాల తలరాతలు మార్చే చారిత్రక అవకాశం తనకు గొప్ప ఉపశమనాన్నిచ్చిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణను దోపిడీ-నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి మీరు సిద్ధమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దోపిడి కొట్టాలకు నిప్పులంటుకున్నాయని, బహుజనుల ఓటు హక్కుతో ఊది ఊది ఆ నిప్పును మరింత మండిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed