- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘దిశ’ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్పింగ్స్..
దిశ, వెబ్‌డెస్క్: ‘దిశ’కు ఉన్న ప్రజాదరణ, ప్రచురించే వార్తలకు ఉన్న విశ్వసనీయతను అనుకూలంగా మల్చుకోడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ శక్తులు క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నాయి. పై వార్తను ‘దిశ’ పత్రిక ఇప్పటివరకు ప్రతిరోజూ ఉదయం వచ్చే రెగ్యులర్ ఎడిషన్‌లోగానీ, రోజుకు మూడుసార్లు వచ్చే డైనమిక్ ఎడిషన్లలోగానీ ప్రచురించలేదు. పత్రిక పేరును వాడుకుని ప్రజలను గందరగోళ పరిచే ఉద్దేశంతో మార్ఫింగ్ చేసిన ఈ క్లిప్పింగ్‌ను వాడుకుంటున్నాయి. ‘దిశ’ ప్రచురించే రెగ్యులర్, డైనమిక్ ఎడిషన్లు ఇప్పటికీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. నిర్ధారణ చేసుకోవాలనుకునేవారు ఇప్పటికైనా వాటిని పరిశీలించుకోవచ్చు. ఈ వార్త క్లిప్పింగ్‌కు ‘దిశ’కు ఎలాంటి సంబంధం లేదు. ‘దిశ’ పేరును వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న కుట్రగానే భావిస్తున్నాం.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు వాటి అభిప్రాయాలను ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్ళడానికి బదులుగా గందరగోళంలోకి నెట్టేందుకు ఇలాంటి ఎత్తుగడలను వాడుకోవడం దురదృష్టకరం. ఇప్పటికే ఈ దుష్ప్రచారాన్ని సైబర్ క్రైమ్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశాం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్లిప్పింగ్‌తో ‘దిశ’కు ఎలాంటి సంబంధం లేదని రూఢీ చేయడమే కాకుండా దీన్ని నమ్మవద్దని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం.