- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు అలర్ట్.. కీలక నిర్ణయం దిశగా సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో ఫేసియల్ అటెండెన్స్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోనున్నారు. మంత్రి ఆఫీస్నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోని సిబ్బంది వరకు అందరికీ పేస్స్క్రీనింగ్ పెట్టాలని సర్కార్ ఆలోచిస్తున్నది. ఇప్పటికే బయోమెట్రిక్ఉన్నప్పటికీ చాలా మంది టెక్నికల్ మెథడ్‌లతో ఆసుపత్రులు, కార్యాలయాలకు రాకుండానే అటెండెన్స్వేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని మంత్రి హరీష్‌రావు సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ పేస్మిషన్లు స్క్రీనింగ్‌లు కోఠిలోని కమాండ్ కంట్రోల్, హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ పేషీలకు అటాచ్ చేస్తారు. ఈ విధానంతో వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టే పరిస్థితి ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు. జీపీఎస్ మాప్ కెమెరా ద్వారా ఫోటో అటెండెన్స్ వేస్తారు. ఖమ్మం , ములుగులో ఇప్పటికే ప్రారంభంగా కాగా.. అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కొందరు విధులకు డుమ్మా కొడుతుండటంతో సర్కార్ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.