- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
దిశ, డైనమిక్ బ్యూరో: ఇవ్వాళ ఐపీఎల్ మ్యాచ్ నేపధ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబందించి టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యి ఐపీఎల్ టికెట్లను అక్రమంగా అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి ఆరోపించారు. ఐపీఎల్ టికెట్లను అక్రమంగా అమ్ముకున్న జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిరసన కారులు స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు జగన్మోహన్ రావుపై సత్వరమే చర్యలు చేపట్టాని ఆయన దిష్టి బొమ్మను చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.