సమ్మర్‌లో అతిగా బీర్లు తాగుతున్నారా?.. ఈ నాలుగు విషయాలు తెలుసుకోకపోతే అంతే సంగతి!

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-18 04:03:29.0  )
సమ్మర్‌లో అతిగా బీర్లు తాగుతున్నారా?.. ఈ నాలుగు విషయాలు తెలుసుకోకపోతే అంతే సంగతి!
X

దిశ, వెబ్‌డెస్క్: మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. సమ్మర్(Summar) వచ్చిందంటే చాలు.. మందుబాబులు కాస్త వింతగానే ప్రవర్తిస్తుంటారు. అప్పటివరకు ఆ మందు.. ఈ మందు.. ఆ బ్రాండు.. ఈ బ్రాండు అంటూ మందు తాగేవాళ్లంతా సమ్మర్‌లో బీర్లు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. రూ.20 వేల రూపాయల మందు ఎదురుగా పెట్టినా.. రెండొందల బీర్‌కే ప్రయారిటీ ఇస్తుంటారు. ఎండలు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. ఈ నేపథ్యంలో మందుబాబుల(Liquor Lovers)కు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మందు తాగేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రమాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది తాగేటప్పుడు కారంతో కూడిన స్టఫ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఉప్పుతో కూడిన పదార్థాలతో పాటు మసాలా ఎక్కువగా ఉన్న చికెన్, మటన్ లాంటివి బీర్‌తో తీసుకోకూడదంట. దీని వలన యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయట. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిని కూడా బీర్‌ తాగేటప్పుడు తీసుకోకూడదంట. ఇందులో అధికంగా సోడియం ఉంటుంది. అందువల్ల బీర్‌తో వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు వైద్యులు. అందువల్ల ఎగ్ వైట్‌తో చేసిన పదార్థాలు, చేపలు, ఉడికించిన వేరుశెన, మొలకెత్తిన విత్తనాలు వంటికి బీరు తాగే సమయంలో మంచింగ్‌గా తీసుకోవాలని ఓ నివేదికలో పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రస్తుత బీర్ల ధరలు :

కేఎఫ్ లైట్ = రూ.172.5

కేఎఫ్ స్ట్రాంగ్ = రూ.184

కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ = రూ.253

బడ్వైజర్ లైట్ = రూ.241.5

బడ్వైజర్ మ్యాగ్నం= రూ.253

టూబర్గ్ స్ట్రాంగ్ = రూ.276

Next Story

Most Viewed