ఒకరు ఫిక్స్.. మరో ఇద్దరు ఎవరు..? విభజన సమస్యల పరిష్కార కమిటీపై తీవ్ర ఉత్కంఠ

by Satheesh |
ఒకరు ఫిక్స్.. మరో ఇద్దరు ఎవరు..? విభజన సమస్యల పరిష్కార కమిటీపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కొలిక్కి తేవడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పడనున్న కమిటీల కూర్పుపై కసరత్తు మొదలైంది. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల ఆధ్వర్యంలో ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు చొప్పున సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండే ఈ కమిటీలో సమర్ధులైనవారిని ఎంపిక చేయడంపై రెండు ప్రభుత్వాలూ ఫోకస్ పెట్టాయి. రెండు వారాల్లో ఈ కమిటీ ఫస్ట్ మీటింగ్ జరగాలని ఇద్దరు ముఖ్యమంత్రుల కమిటీలో నిర్ణయం జరిగినందున దానికి తగినట్లుగా కూర్పుపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ దష్టి సారించారు.

పదేండ్లుగా విభజన చట్టంలోని అంశాలను పర్యవేక్షిస్తున్న ఫైనాన్స్ డిపార్టుమెంటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ కమిటీలో ఉండనున్నారు. మిగిలిన ఇద్దరు అధికారులను గుర్తించి చోటు కల్పించడంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానున్నది. ఎంపిక చేసిన తర్వాత ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి తెలంగాణ సీఎస్ తెలియజేయనున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం చీఫ్ సెక్రెటరీతో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను ఈ కమిటీలో చేర్చనున్నది. దీనిపైనా ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed