- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Phone Tapping Case: ముగిసిన చిరుమర్తి లింగయ్య విచారణ.. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. విచారణకు ముందు కూడా చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలో పని చేసిన పోలీసు అధికారులతో తాను మాట్లాడి ఉండవచ్చునని అన్నారు. అలాగే పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం మాట్లాడటం సహజమేనన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఈ నోటీసులపై న్యాయపోరాటం కూడా చేస్తానన్నారు.