Harish Rao:‘ప్రభుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ద‌ళారుల పాలైన ధాన్యం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Harish Rao:‘ప్రభుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ద‌ళారుల పాలైన ధాన్యం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నేడు(బుధవారం) మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Former Minister Harish Rao) నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ ఏడాది కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని తెలిపారు. సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని(Metric tons of grain) కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది.

కానీ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Government) నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులు రూ .1800 లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పై హరీష్ రావు ఫైరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed