- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త సెక్రటేరియట్‌లో అన్నీ సారుకు నచ్చినట్టే!
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్‌లో ఇంటీరియర్ డిజైన్ మొదలుకుని సిట్టింగ్ అరేంజ్ మెంట్స్ వరకు అన్నీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మినిస్టర్ల చాంబర్లు కూడా ఆయన ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మంత్రులు, అధికారులు, స్టాఫ్ ఉపయోగిస్తున్న కంప్యూటర్స్, ఫైల్స్ మినహా అన్నింటినీ కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఒకే తీరుగా ఉండేవిధంగా టేబుల్స్, చైర్స్, సోఫాలు, మీటింగ్ హాల్‌ను రూపొందిస్తున్నారు.
సొంత ఇష్టాలకు చెక్
ఏ ఫ్లోర్‌లో ఏశాఖ ఉండాలి? ఏ మంత్రి ఏ చాంబర్‌లో కూర్చోవాలి? ఏ చాంబర్‌లో ఎలాంటి లైటింగ్ ఉండాలి? ఏ సెక్రటరీ ఎక్కడ ఉండాలి? వాళ్లకు ఏ టేబుల్ వేయాలి? ఏ చైర్‌లో కూర్చోవాలి? ఇలా ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా గైడ్ చేస్తున్నట్లు తెలిసింది. గతంలో మంత్రులు బాధ్యతలు చేపట్టాక తమకు ఫలాన చాంబర్ కావాలని, ఫలాన చోట చైర్ వేయాలని అధికారులపై ఒత్తిడి చేసేవారు. ఇలాంటి వాటన్నింటికి సీఎం కేసీఆర్ చెక్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొత్త సెక్రటేరియట్‌లో పర్మినెంట్‌గా సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ ఉంది.
ప్రారంభంలోపే శాఖల తరలింపు
ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12 లోపు కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి పరిమితం కాకుండా, అక్కడి నుంచే పాలనా కార్యక్రమాలను కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ ప్లానింగ్ చేస్తున్నారు. అందుకోసం బీఆర్కే బిల్డింగ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న శాఖలను వచ్చే నెల 30 లోపు కొత్త బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయించాలని భావిస్తున్నారు. పాత టెబుల్స్, చైర్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో కొత్త సెక్రటేరియట్‌లో కనిపించవద్దని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఇందుకోసం ఏప్రిల్ 24 లోపు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏ శాఖ ఏ ఫ్లోర్‌లో, ఎక్కడ ఇవ్వాలో ఫైనల్ చేస్తారని తెలిసింది.
సీఎస్‌కు సీఎం ఝలక్!
కొత్త సెక్రటేరియట్‌లో డిపార్ట్‌మెంట్స్ సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్‌పై సీఎస్ శాంతికుమారి, అర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాస రాజు గీత దాటడంతో సీం ఆగ్రహానికి గురైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఇద్దరు ఆఫీసర్లు తమకు నచ్చిన విధంగా సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్‌ను ఫైనల్ చేసి ప్రగతిభవన్‌కు అందించడంతో సీఎం సీరియస్ అయినట్టు టాక్ ఉంది. అయితే ప్రభుత్వంలోని ఓ సలహాదారుడు తనకు ఫలాన చోట మాత్రమే చాంబర్ కేటాయించాలని ఆర్ అండ్ బీ అధికారులపై ఒత్తిడి తేగా, సీఎం కేసీఆర్ ఆ అడ్వయిజర్‌పై కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం.